'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి' నవంబర్ 4న విడుదల...
- October 24, 2016
అందమైన ప్రేమకథతో 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి' చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు ఎస్.జె.చైతన్య తెలిపారు. ఎ.రవితేజ, అశ్విని చంద్రశేఖర్ జంటగా రెడ్‌కార్పెట్ రీల్స్ పతాకంపై శైలజ సమర్పణలో రవి పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆదివారంనాడు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ, 'ప్రభాస్‌కు మా యూనిట్ తరపున జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. ఈ టైటిల్ ఎంతమాత్రం వివాదాస్పదం కాదు. తెలుగులో మొదటిసారిగా ఏడవటానికి వాడే గ్లిజరిన్‌ని నవ్వించటానికి ఉపయోగించాం. అలాగే నెల్లూరులోని రియల్ గ్యాంగ్‌స్టర్స్‌ను ఈ చిత్రంలో నటింపజేశాం.ఓ యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాం. చిన్న సినిమాలను తీయడం కంటే విడుదలచేయడం కష్టమైన ఈ పరిస్థితులలో పక్కా ప్రణాళికతో మేం ముందుకెళ్తున్నాం' అని అన్నారు. నిర్మాత రవి మాట్లాడుతూ, అందరినీ అలరింపజేసేవిధంగా వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని, నవంబర్ 4న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. హీరో ఎ.రవితేజ మాట్లాడుతూ, 'డార్క్ కామెడీతో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ అంతా నెల్లూరులో జరిగింది.పాత్రల మధ్య సీరియస్‌నెస్ ఉన్నా చూసే ప్రేక్షకులు హాస్యంతో ఆనందిస్తారు' అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్లు అశ్విని చంద్రశేఖర్, భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కవిశంకర్, కెమెరా: ఆర్తి.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







