నటుడు రఘుబాబు ఇప్పుడు బుల్లితెరపై సందడి ..
- October 24, 2016
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో మంచి పోజీషన్లో ఉన్న నటులు బుల్లితెరపై కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. ఈ లీస్టులో సీనియర్ నటులు కూడా ఉండటం విశేషం. ఆ మద్య మీలో ఎవరు కోటీశ్వరులు ప్రొగ్రామ్ లో కింగ్ నాగార్జున సందడి చేయగా..ఆయన స్థానంలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. దీంతో మెగా అభిమానులు పట్టరాని ఆనందంలో ఉన్నారు. ఇక వెండితెరపై కనిపిస్తూనే..బుల్లితెరపై తమ సత్తా చాటుతున్న నటులు, కమెడియన్ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తాజాగా ఈ లీస్టులో స్టార్ కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న నటుడు రఘుబాబు ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ప్రముఖ నటులు గిరిబాబు తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రఘుబాబు మొదట్లో విలన్ గా వచ్చి తర్వాత కమెడియన్ గా మారిపోయారుబుల్లి తెరపై వస్తున్న నువ్వా..నేనా అనే సీరియల్ లో రఘుబాబు నటిస్తున్నారు.గత కొంత కాలంగా బుల్లితెరపై ఆలీ యంకర్ గా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సిరియల్స్ లో రఘుబాబు ఎంట్రీతో కమెడియన్స్ ఎలాంటి ఈగో ఫీలింగ్ లేకుండా నటిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు వెండితెరపై 'జబర్ధస్త్' టీమ్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో సీనియర్ కమెడియన్లు ఇలాంటి రూట్లు ఎన్నకుంటున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైని దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే ఇదే మరి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







