'భైరవ' తుదిదశ షూటింగ్‌కు భారీ భద్రత
- October 24, 2016
ఇటీవల కొంతకాలంగా ప్రముఖ హీరోల సినిమా షూటింగ్‌లను సెల్ఫోన్లో వీడియో తీసి, ఇంటర్నెట్లో విడుదల చేయడం అలవాటుగా మారింది. ఆ మధ్య రజనీకాంత్ 'కబాలి' చిత్ర షూటింగ్ మలేషియాలో జరిగినప్పుడు అక్కడ చిత్రీకరణ చూస్తున్న అభిమానుల్లో ఒకరు వీడియో తీసి ఇంటర్నెట్లో విడుదల చేశారు. అదే విధంగా సిరుత్తై శివ దర్శకత్వంలో అజిత్ నటించిన 57వ చిత్ర షూటింగ్ ఐరోపాలో తీసిన దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. తర్వాత ఆయన షూటింగ్‌కు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ నటిస్తున్న 'భైరవ' చిత్ర షూటింగ్ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది.
ఇక్కడ కీర్తిసురేష్‌తో విజయ్ నటిస్తున్న పాటల సన్నివేశాలను ఎవరో ఫొటో తీసి నెట్లో పెట్టారు. వీటిని చూసి దిగ్భ్రాంతి చెందిన 'భైరవ' యూనిట్ అప్రమత్తమైంది. ప్రస్తుతం అటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. షూటింగ్ స్పాట్‌కు సంబంధం లేని వారిని ప్రవేశించనీయకుండా సెక్యూరిటీని పెంచారట.
తుదిదశ షూటింగ్‌కు భారీ భద్రత కల్పించనున్నట్లు చిత్ర యూనిట్ సమాచారం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







