ఢిల్లీలో పేలుడు కలకలం....

- October 25, 2016 , by Maagulf
ఢిల్లీలో పేలుడు కలకలం....

దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది. చాందనీచౌక్‌ దగ్గరలోని నయాబజార్‌లో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అయితే ఇది బాంబు పేలుడా? లేక బాణాసంచా దుకాణంలో జరిగిన పేలుడా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పేలుడుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com