తల్లికి గుడి కట్టిస్తున్న హీరో లారెన్స్ ....
- October 26, 2016
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్వయం కృషితో పైకి వచ్చిన వారు ఉన్నారు. కష్టాన్ని నమ్ముకొని ఇండస్ట్రీలో ఎన్నో వొడిదుడుకులు అనుభవిస్తూ అంచెలంచెలుగా పైకి వచ్చి ఇప్పుడు స్టార్ హోదాలో ఉన్నవారు చాలా కొద్దిమంది ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్, నాని లాంటి వారు హీరోలుగా సెటిల్ అయితే..కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చి..నటుడిగా,దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. ముఠామేస్త్రీ చిత్రంలో గ్రూప్ డ్యాన్స్ లో ఒకరిగా వచ్చిన లారెన్స్ అదే చిరంజీవికి డ్యాన్స్ కంపోజ్ చేసే లెవెల్ కి ఎదిగాడు.ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 'ఖైది నెం.150'చిత్రంలో మాస్ సాంగ్ కంపోజ్ చేస్తున్నాడు.ఈ సాంగ్ లో చిరంజీవితో పాటు హాట్ బాంబ్ లక్ష్మీరాయ్ జంటగా నటిస్తుంది. అంతే కాదు మరో ప్రత్యేకత ఏంటంటే ఈ పాటలో మెగా తనయుడు రాంచరణ్ కూడా కొద్దిసేపు కనిపిస్తాడట. ఇదంతా పక్కన బెడితే..లారెన్స్ ఎంతో ఉదార స్వభావం కలిగిన వ్యక్తి. ఆ మద్య చెన్నైలో వరదలు ముంచెత్తాయి..ఈ సమయంలో లారెన్స్ 5 కోట్లు విరాళం ఇచ్చాడు. అంతే కాదు స్వయంగా తన ట్రస్ట్ బృందంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా లారెన్స్ 131 మందికి గుండె ఆపరేషన్ లను చేయించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు .ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న చిన్నారి కుటుంబాలను ఆదుకోవాలన్న సత్సంకల్పం తో లారెన్స్ ఈ మహత్కార్యానికి పూనుకున్నాడు. ఒకవైపు నటుడిగా దర్శకుడి గా తన జీవితాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవలు అందిస్తున్నాడు . తల్లికి గుడి కట్టిస్తున్న హీరో లారెన్స్ కావడం గమనార్హం. ప్రస్తుతం తెలుగ, తమిళ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న లారెన్స్ మనసున్న మహరాజు అనిపించుకున్నాడు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







