జెట్ ఎయిర్ వేస్ దీపావళి బొనాంజా...
- October 26, 2016
దీపావళి పండుగ సందర్భంగా విమానయాన సంస్థల దీపావళి బొనాంజా కొనసాగుతోంది. తాజాగా జెట్ ఎయిర్ వేస్ కొత్త తగ్గింపు ధరలను ప్రకటించింది. రూ. 921 (అన్నీ చార్జీలు కలుపుకొని) నుంచి ప్రారంభమయ్యే విమాన టికెట్ ధరలను బుధవారం ప్రకటించింది. ఈ ఆఫర్ నిర్దిష్ట మార్గాలలో ఆరు రోజుల పాటు అమలుచేయనున్నట్టు తెలిపింది.
అక్టోబర్ 25 నుండి 30 వరకు అమలు చేయనున్న ఈ సిక్స్ డేస్ సేల్ ఒకవైపు ధరలకు, డైరెక్ట్ విమానాలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ బుకింగ్ తరువాత 15 రోజుల్లోపు జెట్ ఎయిర్వేస్ యొక్క నెట్ వర్క్ లో నిర్దిష్ట దేశీయ రూట్లలో ప్రయాణించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో నేడు తెలియచేసింది.
దీపావళి నేపథ్యంలోఈ ఆఫర్ ప్రకటించామని, బుకింగ్ తర్వాత మాత్రమే 15 రోజుల్లో నవంబర్ 9 న గానీ, లేదా తర్వాత గానీ ప్రయా
ప్రయాణం చేయొచ్చని జెట్ ఎయిర్ వేస్ చీఫ్ కమర్షియల్స్ ఆఫీసర్ జయరాజ్ షణ్ముగం తెలిపారు.
దీంతోపాటు మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే మరో రూ. 200 డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు. 117 విమానాలతో సేవలు అందిస్తున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థ ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలోఈఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







