'బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నడక'
- October 26, 2016
బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 'బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నడక' నిర్వహించారు. బీఐఏసీహెచ్ అండ్ ఆర్‌ఐ ఛైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణ, ఎంపీ కల్వకుంట్ల కవిత, సినీనటి మంచు లక్ష్మి జెండా వూపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేబీఆర్ పార్క్ నుంచి బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి వరకు నడక నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్‌తో ప్రతి నిమిషానికి ఒక మహిళ చనిపోతున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో రొమ్ముక్యాన్సర్‌పై సరైన అవగాహన లేదన్నారు.బసవతారకం ఆసుపత్రికి మాత్రమే మోనోగ్రఫీ మొబైల్ వాహనం సౌకర్యం ఉందని వెల్లడించారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. రొమ్మ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్‌పై మరింత అవగాహన పెరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







