ఒమన్ పార్క్ లో వదిలివేయబడిన నవజాత పసిపాప
- October 26, 2016
మస్కట్ : కన్నవారు కర్కశంగా వదలిపెట్టిన నవజాత శిశువు సోమవారం ఉదయం అమెరిట్ పార్క్ సమీపంలో రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ద్వారా కనుగొనబడింది.గస్తీ దళం ఉదయం 6:30 గంటల సమయంలో ఈ పసిగుడ్డు వారికి లభ్యం కాబడింది. ఆ శిశువుని ఒక దుప్పటి లో చుట్టి అక్కడ విడిచిపెట్టారు. బొడ్డు తాడు కూడా సరిగా కత్తిరించబడని స్థితిలో ఉన్న ఆ పసిపాపను ఖోయూల ఆస్పత్రిలో చేర్పించినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. కేవలం రెండు రోజుల క్రితమే ఆ శిశువు జన్మించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఒక టవల్ చుట్టి కంకర రోడ్డు మార్గంలో నిర్దయగా విడిచి వెళ్ళిపోయారు. అంబులెన్స్ సిబ్బంది ఆ పసిగుడ్డుకు ప్రథమ చికిత్స జరిపి ఖోయూల ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఉన్న ప్రతినిధి మాట్లాడుతూ, శిశువు యొక్క ఆరోగ్య పరిస్థితి ఎంతో క్షీణించింది.సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ నుండి ఒక అధికారిక విభాగం ఆ శిశువు యొక్క ఆరోగ్య పర్యవేక్షణ, పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







