పూల్‌మఖానా ఖీర్
- October 26, 2016
కావలసిన పదార్ధాలు: ఫూల్‌మఖానా (తామర గింజలు) - ఒక కప్పు, పాలు - అరలీటర్, పంచదార - 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి - ఒక టేబుల్ స్పూన, యాలకుల పొడి - అర టీ స్పూన, బాదంపప్పు - 4
తయారుచేసే పద్దతి:ఒక బాండీలో కొంచెం నెయ్యి వేసి ఫూల్మఖానాని ఎర్రగా, క్రిస్పీగా అయ్యేదాకా వేయించి పక్కన పెట్టాలి. వేయించిన ఫూల్మఖానాలో కొన్ని మిక్సీ జార్లో వేసి పొడిచేసి పెట్టాలి. అడుగు మందంగా ఉన్న బాండీ లేదా గిన్నెలో పాలు పోసి మరిగించాలి. మరిగిన పాలలో పొడిచేసి పెట్టిన ఫూల్‌మఖానా వేసి బాగా కలపాలి. ఇందులో పంచదార, యాలకుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు మిగిలిన ఫూల్‌మఖానా కూడా వేసి, బాగా కలిపి, స్టవ్‌ని సిమ్‌లో ఉంచి 9 - 10 నిమిషాలు ఉడికించాలి. బాదం పలుకులు కూడా వేసి, స్టవ్‌ని పూర్తిగా సిమ్‌లో ఉంచి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. టేస్టీగా, ఈజీగా తయారయ్యే ఫూల్ మఖానా ఖీర్ రెడీ. దీన్ని వేడిగా కానీ, చల్లగా కానీ తినొచ్చు. చల్లబడితే కొంచెం చిక్కగా తయారయి బాగుంటుంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









