తెలుగు రాష్ట్రాల్లో దీపావళికి తమిళ మూవీల సందడి...
- October 26, 2016
సినిమాలకు పండుగల సీజన్ అంటూ ప్రత్యేకంగా ఉంటుంది. సహజంగా పండుగలకు ప్రత్యేకంగా సెలవులు ఉంటాయి. అందరూ ఎంజాయ్ మూడ్‌లో ఉంటారు కాబట్టి కొత్త సినిమాలకు మంచి కలక్షన్లు వస్తాయి. ఈ ఉద్దేశంతో భారీ చిత్రాలను సీజన్ చూసి రిలీజ్ చేస్తుంటారు.
ఇది సంప్రదాయంగా వస్తున్నదే. సంక్రాంతితో ఈ హడావుడి మొదలై విజయదశమి వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చేది దీపావళి. అయితే దీపావళికి మాత్రం టాలీవుడ్‌లో కొత్త సినిమాల సందడి ఉండదు. కోలివుడ్, బాలీవుడ్ మాత్రం ఈ సీజన్‌ను అపయోగిం చుకుంటాయి.
దీపావళికి మాత్రం తెలుగు సినిమాలను విడుదల చేసే సంప్రదాయం లేదు. దీపావళికి పక్షం రోజుల ముందే విజయదశమి వస్తుంది కాబట్టి కొత్త సినిమాలు విడుదలై థియేటర్లలో ఉంటాయి.
ఈ సారి దసరాకి కూడా ఐదు చిత్రాలు ప్రేక్షకుల ముందుకువచ్చాయి. వీటినే మనం దీపావళి సినిమాలని కూడా అనుకోవాలి. దీపావళి అమావాస్యలో వచ్చే వెలుగు పండగ. అందువల్ల ఆ రోజున సినిమాలు విడుదల చేయడానికి తెలుగు నిర్మాతలు ఇష్టపడరు. కొన్ని సార్లు మాత్రం సెంటిమెంట్‌ను పక్కనపెట్టేసి సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలున్నాయి. గత ఏడాది అక్కినేని అఖిల్ నటించగా వినాయక్ దర్శకత్వం వహించిన అఖిల్ సినిమా దీపావళికి విడుదలైంది. దీని ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే. వారం రోజుల ముందు కలర్స్ స్వాతి నటించిన త్రిపుర రిలీజైంది. దానికంటే ముందు ఏడాది అంటే 2014లో దీపావళికి వారం ముందు ఒక లైలా కోసం, వారం తర్వాత కార్తికేయ సినిమాలు రిలీజయ్యాయి. కారణం తెలియదు కానీ దీపావళికి రిలీజైన తెలుగు చిత్రాలు ప్రతికూల ఫలితాన్ని చూశాయి. అందుకే ఈసారి రెండు రాష్ట్రాల్లో తమిళ అనువాద సినిమాలే హల్‌చెల్ చేయనున్నాయి. కార్తి, నయనతార నటించిన కాష్మోరా, ధనుష్, త్రిష నటించిన ధర్మయోగి, విజయ్ ఆంథోని నటించిన సైతాన్ చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్నాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తమిళులకు దీపావలి పెద్ద పండుగ. మనకు సంక్రాంతిలాగా వారికి దీపావళి. గతంలో దీపావళికి కనీసం డజను సినిమాలను విడుదల చేసేవారు. కానీ క్రమంగా ఈ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈసారి కేవలం మూడు సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. చిత్రమేమంటే ఈ మూడు చిత్రాలే అనువాదమై తెలుగులో వస్తున్నాయి
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









