'APNRT' సేవలను కొనియాడిన భారత రాయబారి
- October 26, 2016
విదేశాల్లోని ప్రవాసాంధ్రులకు అండగా నిలబడటంతో పాటు మాతృభూమి అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఏర్పడ్డ ఏపీఎన్నార్టీ సేవలను కువైట్‌లోని భారత రాయబారి కొనియాడారు. ఏపీఎన్నార్టీఎస్ సభ్యులు కువైట్‌లోని భారత రాయబారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులకు ఏపీఎన్నార్టీ అందిస్తున్న సేవల గురించి వారు ఆయనకు వివరించారు. ఏపీఎన్నార్టీ కో-ఆర్డినేటర్ల బాధ్యతలు, వారు ప్రవాసాంధ్రులకు అందిస్తున్న సేవలను కూడా ప్రస్తావించారు.
ఏపీఎన్నార్టీ సేవలను ఆసక్తిగా ఆలకించిన ఆయన… సదరు సేవలను బ్లూ కాలర్ వర్కర్లకు కూడా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భారత రాయబార కార్యాలయం నుంచి ఏపీఎన్నార్టీఎస్‌కు సంపూర్ణ సహకారం అందిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. భారత రాయబారిని కలిసిన వారిలో ఏపీఎన్నార్టీ ప్రతినిధులు సుబ్బరాయుడు ములకల, బలరామ్ నాయుడు, వెంకట్ కోడూరి, దివాకర్ నాయుడు ఒలేటి, వెంకటేశ్ నాయుడు వేగి, పేరమ్ రమణ, మాలేపాటి సురేశ్‌బాబు నాయుడు, మాలేపాటి వెంకటేశ్వర్లు, ఉదయ్ ప్రకాశ్, కేవీఎన్ ప్రసాద్, పోలవరపు బాబునాయుడు, సాయి వెంకటసుబ్బారావు, ఎద్సానీ బాషా, మరాతు మల్లికార్జున, నాగేందర్ బాబు, ఫణి క్రిష్ణ, జ్యోత్స్న ముప్పాల తదితరులు ఉన్నారు.


తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం







