మధ్య ఇటలీ లో తీవ్ర భూకంపం ...
- October 27, 2016
మధ్య ఇటలీ ప్రాంతంలో బుధవారం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 6.0గా నమోదైనట్లు అమెరికా భూభౌతిక పరిశోధనా సంస్థ తెలిపింది. ప్రాణ నష్టంపై కచ్చితమైన సమాచారం లేదు. భారీ భూకంపానికి 2 గంటల ముందు 5.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. రోమ్‌కు దక్షిణాన 150 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్లలో లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావం మార్చీ ప్రాంతంలోని కాస్టిలాంజింలో సుల్‌నీరా పట్టణంపై తీవ్రంగా ఉంది. ఈ పట్టణంలో చాలా ఇళ్లు పాక్షింగా దెబ్బతిన్నట్లు సమాచారం. దీనికి సమీపంలోని విస్సో పట్టణంలో కొంత మంది గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు.ఒక పురాతన చర్చి ధ్వంసమైనట్లు సమాచారం. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రాంతానికి వచ్చే రహదారులను అధికారులు మూసివేశారు.భూకంప సమాచారం అందిన వెంటనే ఇటలీ ప్రధాని మాట్టీయో రెన్జీ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని సహాయక చర్యలపై సమీక్షించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









