'డోంట్ బ్రీత్' తమిళ, తెలుగు రీమేకలో విక్రమ్ ...
- October 27, 2016
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోవడమే కాదు దానికి తగ్గట్టుగా ఎంత రిస్క్ అయినప్పటికీ తన బాడీలాంగ్వేజ్‌ను మార్చుకునే నటులలో విక్రమ్ ఒకరు. సాధారణంగా సినిమా, సినిమాకు అలా మార్చుకోవడం అంటే ఎవరికైనా విసుగుపుడుతుంది. కానీ విక్రమ్‌లాంటి నటులు మాత్రం ఆ పాత్ర కోసమే పుట్టినట్లుగా దృఢదీక్షతో ఆయనకు ఆ చిత్రం ప్రేక్షకాదరణకు నోచుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది.కొంతకాలంగా ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ విజయాలు దక్కక నిరుత్సాహంలో ఉన్న ఆయనకు 'ఇరుముగన్' ఇచ్చిన స్ఫూర్తితో నూతన చిత్రం కోసం మళ్లీ కసరత్తును మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. హాలీవుడ్లో రూపొంది ఘన విజయం సాధించిన 'డోంట్ బ్రీత్' అనే చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రీమేక చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినిపిస్తోంది. డిసెంబర్లో ఈ చిత్రం సెట్స్‌పైకి వస్తుందని, ఇప్పట్నుంచే ఇందులోని పాత్రకు తగ్గట్టుగా విక్రమ్ తన బాడీని మార్చుకుంటున్నట్లు, ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా జిమ్‌లో కసరత్తు చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాల భోగట్టా. దీనికి 'ఇరుమురగన్' దర్శకుడు ఆనంద్‌శంకర్ దర్శకత్వం వహిస్తారని సమాచారం.ఇదిలావుండగా గతంలో తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన 'సామి' చిత్రానికి సీక్వెల్‌గా హరి దర్శకత్వంలో 'సామి 2' చిత్రంలో కూడా నటించేందుకు ఆయన పచ్చజెండా ఊపారని ఈ రెండు చిత్రాలు ఒకదానివెంట మరొకటి ఉంటాయని అంటున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







