బొటానికల్ వండర్: సిటీల్యాండ్ మాల్
- October 27, 2016
దుబాయ్ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తొలిసారిగా 1.1 బిలియన్ దిర్హామ్‌ల ఖర్చుతో సిటీ ల్యాండ్ మాల్‌ని రూపొందించింది. బొటానికల్ వండర్స్‌తో, తొలిసారి నేచుర్ ఇన్‌స్పైర్డ్ మాల్‌ని దుబాయ్ సొంతం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. 2018 రెండో క్వార్టర్‌లో ఈ మాల్ ప్రారంభోత్సవం జరగనుంది. దుబాయ్ మిరాకిల్ గార్డెన్, దుబాయ్ బటర్‌ఫ్లై గార్డెన్‌లను నిర్మించిన సిటీ ల్యాండ్ గ్రూప్, ఈ నేచుర్ ఇన్‌స్పైర్డ్ మాల్‌ని రూపొందించింది. 1.13 మిలియన్ స్క్వేర్‌ఫీట్‌తో ఈ మాల్‌ని సింగిల్ లెవల్‌లో తీర్చిదిద్దారు. యాంపీ థియేటర్, మినీ వాటర్ పార్క్, మినీ మారికల్ గార్డెన్, రిక్రియేషన్ వెల్‌నెస్ వంటి సౌకర్యాలతో దీన్ని రూపొందించారు. సిటీల్యాండ్ గ్రూప్ ఛైర్మన్ షేక్ తాయెబ్ బిన్ తహ్‌నూన్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ షాపింగ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించేలా దీన్ని తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఏడాదికి 12 మిలియన్ సందర్శకులు ఈ మాల్‌ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. గ్లోబల్ కల్చర్‌ని అలాగే ఆధునికతను మేళవించి ఈ మాల్‌ని రూపొందించారు. హోమ్ ఫర్నిషింగ్ స్టోర్స్, ఎలక్ట్రానిక్ ఔట్‌లెట్స్, కాస్మొటిక్ షాప్స్, పర్సనల్ మరియు బ్యాంకింగ్ సర్వీసులు ఇలా 350 రిటైల్ స్టోర్స్ ఇందులో పొందుపర్చబడుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







