సిరియాలోని ఓ పాఠశాలపై వైమానిక దాడి...

- October 27, 2016 , by Maagulf
సిరియాలోని ఓ పాఠశాలపై  వైమానిక దాడి...

సిరియాలోని ఓ పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 22 మంది చిన్నారులు, ఆరుగురు ఉపాధ్యాయులు మరణించినట్లు ఐరాస పిల్లల విభాగం యునిసెఫ్‌ వెల్లడించింది. ఇది అత్యంత విషాదమని, యుద్ధనేరమని యునిసెఫ్‌ డైరెక్టర్‌ ఆంటోనీ లేక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సిరియాలోని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఇడిలిబ్‌ ప్రావిన్స్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాఠశాలలపై జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదేనని లేక్‌ పేర్కొన్నారు.రష్యా, సిరియా యుద్ధ విమానాలు ఇడిలిబ్‌ ప్రావిన్స్‌లోని హాస్‌ గ్రామంలో దాదాపు ఆరుసార్లు వైమానిక దాడులకు పాల్పడ్డారని, పాఠశాల కాంప్లెక్స్‌పైనా దాడులు చేయడంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని సిరియాకు చెందిన ఓ మానవ హక్కుల పరిశీలన సంస్థ కూడా వెల్లడించింది.దాడులకు సంబంధించి పాఠశాలలోని హృదయవిదారక దృశ్యాలు సోషల్‌మీడియాలు కనిపిస్తున్నాయి.ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల అరాచకాలు, తిరుగుబాటుదారుల దాడులు, అంతర్యుద్ధంతో సిరియా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులను అణచడానికి సిరియా ప్రభుత్వం ఇతర దేశాల సహాయంతో వైమానిక దాడులు చేస్తోంది. అయితే ఈ దాడుల్లో సాధారణ ప్రజలు కూడా సమిధలవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com