ప్రవాసీయుల బోనస్ అలవెన్సులలో కోత విధించండి

ప్రవాసీయుల బోనస్ అలవెన్సులలో కోత విధించండి
మనామా : ప్రవాసీయులకు ఇచ్చే బోనస్, అలవెన్సులులో 50 శాతం వరకు తగ్గించమని బహ్రేయినీ చట్ట నిర్మాతలు సూచిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ప్రవాసీయులకు ఇచ్చే బోనస్ మరియు ఇతర అలవెన్సులలో కోత విధించాలని  ద్రవ్య మరియు ఆర్థిక వ్యవహారాల కమిటీ సభ్యుడు జలాల్ కాదేం అల్ మఃఫోఉద్ పిలుపు ఇచ్చారు. ప్రవాసీయులకు ఇచ్చే అలవెన్సులలో 50 శాతం మేరకు తగ్గించడం ద్వారా ఈ ప్రయోజనం మెరుగు పడుతుందని బహ్రేయినీ రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థపై అనుకూలమైన స్థితి  ప్రతిబింబిస్తాయి మరియు ఆదాయాల సరైన మళ్లింపునకు దారి తీస్తుందని అని ఎంపీ అన్నారు. కువైట్ సైతం ఇదే  విధానం పాటిస్తున్నట్లు అల్ మఃఫోఉద్ గుర్తు చేశారు.కువైట్ ఇటీవల ప్రవాసీయుల అలవెన్సులు  బోనస్  విషయంలో కోత విధించింది. ఈ చర్య ద్వారా కువైట్ జాతీయ ఆర్థిక ప్రయోజనం ఎంతో మెరుగుపడినట్లు నిరూపించబడిందని ఆయన ఉదహరించారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని  ఈ ప్రయోగం బహరేన్ కూడా అమలు చేయాలని సూచించారు. 

Back to Top