బ్రిటన్ ప్రధాని భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు...
- October 27, 2016
బ్రిటన్‌లో ఉంటున్న భారతీయులకు ఆ దేశ ప్రధానమంత్రి థెరిస్సా మే.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. హౌస్ ఆఫ్ పార్లమెంట్‌లో హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్(హెచ్‌ఎఫ్‌బీ) నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆమె పంపిన సందేశాన్ని పార్లమెంట్ అధికారి బాంబ్ బ్లాక్‌మెన్ చదివి వినిపించారు. 'బ్రిటన్‌లోని భారతీయులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి కష్టపడి వాటిని వృద్ధిలోకి తీసుకొస్తారు. అంతేగాకుండా తమ కుటుంబాలకు తగిన ప్రాధాన్యత ఇస్తారు. వారిని చూసి గర్విస్తున్నా' అని ఆమె సందేశంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు వచ్చే నెలలో భారత్ పర్యటనకు రానున్నట్లు ఆమె తెలిపారు'.ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్నారు.థేమ్స్ నదీ తీరాన ఉన్న హౌస్ ఆఫ్ కామన్స్‌లోని టెర్రస్ పెవిలియన్‌లో ఈ వేడుకలు జరిగాయి. మంత్రోచ్ఛరణలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో పార్లమెంటు సభ్యులు, అక్కడ నివసిస్తున్న పలువురు భారతీయులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







