పునరుద్ధీకరణలో జీసస్ సమాధి

- October 28, 2016 , by Maagulf
పునరుద్ధీకరణలో జీసస్ సమాధి

శతాబ్దాల తర్వాత తొలిసారి ఏసుక్రీస్తు సమాధిని తెరిచారు. జెరూసలేం పాత పట్టణం వెలుపల ఒక గుహ వద్ద శిలా సమాధి (ద హోలీ సెపుల్కర్)పై ఉంచిన చలువరాయిని తొలగించారు. సమాధి చుట్టూ నిర్మించిన చర్చిని పునరుద్ధరించే చర్యలో భాగంగా సమాధిపై ఉన్న చలువరాయిని తొలగించారు. మతపెద్దల సమక్షంలో పరిశోధకులు ఈ చలువరాతిని అతి జాగ్రత్తగా తొలగించారు. క్రీ.శ 1555 నుంచి క్రీస్తును సమాధి చేసిన తర్వాత ఈ పవిత్రమైన చలువరాతిని ఏనాడూ కదిలించలేదు. శిలువ మీద మరణించిన ఏసును ఇందులో ఉంచారని, సమాధి చేసిన మూడో రోజే ఆయన పునరుత్ధానం చెందింది కూడా ఇక్కడి నుంచేనని క్రీస్తు మతస్తుల విశ్వాసం. అయితే తాజాగా చర్చిని పునరుద్ధరించే భారీ ప్రాజెక్టు పనుల్లో భాగంగానే పరిశోధకులు దీనిని తెరిచారు. దీనిపై ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగస్వామిగా ఉన్న నేషనల్ జియాగ్రాఫిక్ సొసిటై ఆర్కియాలజిస్ట్ ఫెడ్రిక్ హైబర్ట్ మాట్లాడుతూ 'సమాధిపై కప్పి ఉంచిన చలువరాతిని బయటకు తీశాం. దాని కింద ఉన్న వస్తువులు చూసి ఆశ్చర్యానికి లోనయ్యాం' అన్నారు. సుదీర్ఘకాలంగా జరిపిన శాస్త్రీయ విశ్లేషణ అనంతరం సమాధిపై ఉంచిన చలువరాయిని సంప్రదాయరీతిలో తొలగించామని, ఇందవల్ల సమాధిని అందరూ ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగిందని, దీని కిందే క్రీస్తును ఉంచారని ఆయన తెలిపారు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జీసస్ పార్ధివ శరీరాన్ని ఒక షెల్ఫ్ లేదా బరియల్ బెడ్ మీద ఉంచారు.


అలా చేసిన మూడు రోజుల తర్వాత క్రీస్తు ఇక్కడి నుంచే పునరుత్ధానం చెందారని చెబుతారు. కాగా, క్రీస్తును సమాధి చేసిన ఈ ప్రాంతంలో పెద్ద చర్చిని నిర్మించారు. దాని మధ్యలో సమాధి చుట్టూ 'ఎడుక్యుల్' పేరుతో చిన్న నిర్మాణం ఉంది. ఇందులో ఒకసారి అగ్నిప్రమాదం జరిగింది.


దీంతో 1808-1810 మధ్యలో దీన్ని చివరిసారిగా పునరుద్ధరించారు. తాజాగా దీనిని మరోసారి పునరుద్ధరించనున్నారు. చీఫ్ సైంటిఫిక్ సూపర్‌వైజర్ ప్రొఫెసర్ ఆండోనియో మోరోపౌలోవ్ నిర్దేశకత్వంలో నేషనల్ టెక్నాలకీ యూనివర్శిటీ ఆప్ ఎథేన్స్ పరిశోధకులు ఈ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. ది హోలీ సెపుల్కర్‌ను కాన్‌స్టాంటైన్ చక్రవర్తి తల్లి సెయింట్ హెలీనా కనుగొన్నారని, నాలుగవ శతాబ్ది నుంచి ఒక చర్చి వెలసి ఉందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో తొలిసారి ఏసుక్రీస్తు సమాధిని తెరవడం వల్ల పరిశోధకులు మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com