కువైట్ వైపే మొగ్గుచూపుతున్న ప్రవాసీయులు
- October 28, 2016
అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఓ వెలుగు.. తమను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించే ఓ ఆశ. అదే కువైట్‌లో పని. ఎన్నో దేశాల వాళ్లు కువైట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు, కూలి పనులు చేసుకుంటూ కొంత వెనకేసుకుంటున్నారు. అప్పులు తీర్చడమే కాకుండా తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటున్నారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ సర్వే ఫలితం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కువైట్‌లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న విదేశీయుల్లో 75 శాతం మంది లంచాలు ఇచ్చినవారేనని ఆ సర్వే తేల్చి చెప్పింది.
కువైట్‌లో ఉద్యోగం సంపాదించడానికి స్వదేశంలోనో, కువైట్లోనో మధ్యవర్తులకు ఈ లంచాన్ని ముట్టజెప్పారని చెప్పింది. అంతేకాక గల్ఫ్ దేశాల్లో కువైట్‌కు వెళ్లడానికే అందరూ మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారని తేల్చింది.
కువైట్‌లో వచ్చే జీతం, మెరుగైన జీవితం, వసతులు, నిత్యావసరాల సరుకుల ధరలు.. వంటి అంశాలే దీనికి కారణమట. విదేశీయులకు ఇచ్చే అలవెన్సులు తగ్గించినా.. ఎక్కువ శాతం మంది కువైట్‌లోనే ఉండేందుకు మొగ్గు చూపుతామని చెప్పారట. అదే సౌదీ, ఒమాన్ వంటి ఇతర గల్ఫ్ దేశాల్లో .. జీతాలను తగ్గించగానే సొంత దేశాలకు వెళ్లిపోయే వారి సంఖ్య అధికమని సర్వే తేల్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









