అబుధాబి లో 'NRT' సభ్యత్యానికి అమోఘ స్పందన ...
- October 29, 2016
యు.ఏ.ఈ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన APNRT కో-ఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ మేరకు శుక్రవారం సభ్యులు అబుధాబి లో ఉన్న తెలుగు ప్రజలను కలిసి సభ్యత్వ నమోదు చేసారు.
డాక్టర్ ముక్కు తులసి కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు NRI తెలుగు ప్రజలు సౌకర్యార్థం నూతన పథకాన్ని మొదలు పెట్టడం హర్షించదగ్గ విషయం అని అన్నారు.ఈ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రజల సౌకర్యార్థం ఎన్నో విధాలుగా ఉపోయోగపడుతుందని అన్నారు.
అనురాధ ఒబ్బిలిశెట్టి APNRT యొక్క పథకాలను తెలుగు వారికి వివరించారు.అందరూ ఉపయోగించుకొవాలని కోరారు.తెలుగు వారు తమ సమస్యలను తెలియజేసారు.సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.
శ్రీకాంత్ చిత్తర్వు మాట్లాడుతూ ప్రభుత్వం APNRT ద్వారా విదేశాలలో ఉన్న తెలుగు వారికోసం నిరంతరం APNRT పనిచేస్తుందన్నారు. విదేశాలలో ఉన్న తెలుగు వారికీ ఏదైనా సమస్యలు వారి సొంత ప్రాంతం లో ఉంటె APNRT ని సంప్రదిస్తే పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్య క్రమంలో అనేక మంది తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు , ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందిని APNRT కో-ఆర్డినేటర్స్ తెలియజేసారు.



తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







