ఒమనీయుల కోసం 700 ఉద్యోగాలు
- October 29, 2016
సెబియాక్ డుక్మ్ అనే సంస్థ 700 ఉద్యోగాల్ని ఒమనీయులకు టెక్నికల్ ఫీల్డ్‌లో ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. మిడిల్ ఈస్ట్ ఏసియాలో అతి పెద్ద సెబియాసిక్ యాసిడ్ రిఫైనరీగా సెబియాక్ డక్మ్కి పేరుంది. సెబియాక్ డుక్మ్ చైర్మన్ షేక్ హిలాల్ అల్ మావలి, స్పెషల్ ఎకనమిక్ జోన్ డుక్మ్ (సెజాద్) ఛైర్మన్ యాహ్యా అల్ జాబ్రి ఈ మేరకు కొత్త ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేశారు. 2017 నాటికి ఇది పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. ముందస్తుగా 250 మందికి అవకాశాలు కల్పిస్తామనీ, ఆ తర్వాత మొత్తం 700 మందికి అవకాశాలు కల్పిస్తామని వారు వివరించారు. బయోడీగ్రేడబుల్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్లాస్టిక్స్‌ని తయారు చేయడంలో సెబియాసిక్ యాసిడ్‌ని ఉపయోగిస్తారు. కొత్త ప్లాంట్ ద్వారా 30,000 టన్నుల యాసిడ్‌ని ఏడాదికి ఉత్పత్తి చేసి వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. చైనా, జపాన్ వంటి దేశాలకు ఎక్కువగా ఈ యాసిడ్‌ని ఎగుమతి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









