యూఏఈలో ఏ దిల్ హై ముష్కిల్ కలెక్షన్‌ల వర్షం

- October 29, 2016 , by Maagulf
యూఏఈలో ఏ దిల్ హై ముష్కిల్ కలెక్షన్‌ల వర్షం

భారత్ లో ఎన్నో వివాదాల నడుమ విడుదలైన బాలీవుడ్ మూవీ ఏ దిల్ హై ముష్కిల్ . స్టార్ దర్శకుడు కరణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీ విదేశాలలో మాత్రం అద్భుత కలెక్షన్లతో దూసుకుపోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో విడుదలైన ఈ మూవీ తొలి రోజు ఏకంగా రికార్డు స్థాయిలో 5.54లక్షల అమెరికా డాలర్లు(భారత కరెన్సీలో రూ.3.70 కోట్లు) వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఈ మూవీ ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టిందని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరణ్ జోహర్ నిర్మించిన ఈ మూవీలో రణబీర్ కపూర్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ లాంటి స్టార్స్ తో పాటు పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com