బిజినెస్ ర్యాంకింగ్‌లో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానాల్లో నిలిచాయి.

- October 31, 2016 , by Maagulf
బిజినెస్ ర్యాంకింగ్‌లో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానాల్లో నిలిచాయి.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానాల్లో నిలిచాయి. సోమవారం కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. ర్యాంకుల్లో 98.78 మార్కులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మొదటి స్థానాన్ని దక్కించుకున్నాయి. అలాగే 3వ స్థానంలో గుజరాత్, 4వ స్థానంలో చత్తీసగఢ్‌, 5వ స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి. 2016 సంవత్సరానికి గానూ ఆయా రాష్ట్రాలు వాణిజ్య, వ్యాపార రంగాల్లో సంస్కరణల అమలుపై కేంద్ర వాణిజ్య,వ్యాపారశాఖ సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో ఆయా రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించింది. 2015 నుంచి ఈ ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది.

సంస్కరణల ఆధారంగా రాష్ట్రాలను నాలుగు విభాగాలుగా వాణిజ్యశాఖ విభజించింది. 2015లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో ర్యాంక్ రాగా, తెలంగాణకు 13వ ర్యాంక్ వచ్చింది. కాగా ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొదటి ర్యాంకును ప్రకటించింది. ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం ఘననీయంగా మెరుగుపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com