చేమ దుంప స్పెషల్ కర్రీ

- August 24, 2015 , by Maagulf
చేమ దుంప స్పెషల్ కర్రీ

 

కావలిసిన పదార్ధాలు 

చేమదుంపలు - అరకిలో 

మైదా - రెండు స్పూన్లు 

పెరుగు - కప్పు 

ఉప్పు - తగినంత 

కారం - రెండు స్పూన్లు 

బ్లాక్‌ సాల్ట్‌ - అరటీ స్పూను 

కొత్తిమీర - ఒక కట్ట 

నిమ్మకాయ - అర చెక్క 

గరం మసాలా - ఒక స్పూను 

లవంగాలు - రెండు 

ఇంగువా - చిటికెడు 

జీలకర్ర - అర స్పూను 

అల్లం తురుము - కొద్దిగా 

పచ్చిమిర్చి - రెండు 

తయారీ విధానం 

చేమ దుంపల్ని శుభ్రంగా కడిగి ఉడికించి పొట్టు తీసి గుండ్రని ముక్కల్లా కోసి, నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి పెరుగు తీసుకుని బాగాగిలక్కొట్టి, దానిలో మైదా కలపి మరికొన్ని నీళ్లు పోసి బాగా గిలక్కొట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి దానిలో ఇంగువ, జీలకర్ర, లవంగాలు వేసి వేగాక పచ్చిమిర్చముక్కలు, అల్లం తురుము, పసుపు, కారం, వేసి కలపాలి. ఆ తర్వాత గిలక్కొట్టి పెట్టిన పెరుగు మిశ్రమం వేసి కలపాలి. తరువాత చేమదుంపల్ని, బ్లాక్‌సాల్ట్‌, గరం మసాలా వేసి తిప్పుతూ బాగా కలపాలి. చివరిగి కొత్తిమీర, నిమ్మరసం వేసి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com