ఐదేళ్ల తర్వాత సొంతగడ్డకు బళ్లారికి చేరుకోనున్నా గాలి...

- October 31, 2016 , by Maagulf
ఐదేళ్ల తర్వాత  సొంతగడ్డకు బళ్లారికి చేరుకోనున్నా గాలి...

గనుల అక్రమ తవ్వకం ఆరోపణలపై 2011 సెప్టెంబరు 5న అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ఐదేళ్ల తర్వాత తొలిసారిగా సొంతగడ్డ బళ్లారికి చేరుకోనున్నారు. నవంబరు 16న కుమార్తె బ్రహ్మణి వివాహం నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి 21 వరకు ఆయన బళ్లారిలో ఉండేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. 2011 సెప్టెంబరు 5న బళ్లారిలోని జనార్దన్‌రెడ్డి ఇంటి నుంచి సీబీఐ ఆయన్ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించింది. తర్వాత 2012 ఆగస్టు 16న బందోబస్తు మధ్య ఆయన్ను బళ్లారికి తీసుకొచ్చి అదే రోజు రాత్రి ఇక్కడి కేంద్ర కారాగారానికి తరలించింది. అనంతరం హైదరాబాద్‌, బెంగళూరులలో జనార్దన్‌రెడ్డి మూడున్నరేళ్లపాటు జైలు జీవితం గడిపారు.తర్వాత బెయిలుపై విడుదలైనా బళ్లారికి వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించలేదు. ఇప్పుడు ఆయనకు ఆ అవకాశం లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com