హెజ్బొల్లా లింక్స్: ఏడుగురికి జైలు
- October 31, 2016
ఏడుగురు వ్యక్తులకు అత్యున్నత న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఇరాన్ బ్యాక్డ్ హెజ్బోల్లా మూమెంట్‌తో లింకులున్నాయన్న అభియోగాల మేరకు ఏడుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. ఒక ఎమిరేటీ, ఇద్దరు లెబనీస్ వ్యక్తులకు జీవిత ఖైదు పడగా, ఇరాకీ మరియు మరో లెబనీస్ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. ఈజిప్ట్‌కి చెందిన మహిళ, మరో ఎమిరేటీ వ్యక్తికి పదేళ్ళ జైలు శిక్ష పడింది. లెబనాన్‌కి చెందిన హెజ్బొల్లా తీవ్రవాద సంస్థకు, ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని అందించినట్లుగా వీరిపై అభియోగాలున్నాయి. గ్యాస్ ఫీల్డ్స్ అలాగే ఆయిల్ ప్రొడక్షన్‌కి సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నారనే అభియోగాలూ వీరిపై మోపబడ్డాయి. అరబ్ లీగ్ మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, మార్చ్‌లో హెజ్బోల్లాని తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్కి మద్దతుగా హెజ్బోల్లా పోరాడుతోంది. గల్ఫ్ మద్దతిస్తున్న రెబల్స్‌కి వ్యతిరేకంగా ఈ సంస్థ పనిచేస్తోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









