విడుదలకు సిద్ధముగా ఉన్న 'కేటుగాడు'
- August 25, 2015
ఉలవచారు బిర్యాని' చిత్రంలో హీరోగా నటించి మెప్పించిన యంగ్ హీరో తేజస్ కంచర్ల హీరోగా ప్రముఖ రచయిత వి.ఎస్.పి తెన్నేటి సమర్పణలో వెంకటేష్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'కేటుగాడు'. కిట్టు నల్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వెంకటేష్ బాలసాని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఆడియో మంచి సక్సెస్ సాధించింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకుంది. ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత నేను హీరోగా ఇక్కడ నిలబడటానికి కారణమైన కె.యస్.రామారావుగారు, ప్రకాష్ రాజ్ గారు ఇద్దరూ ఈ సినిమాని చూసి, చాలా బావుందని, చాలా బాగా నటించానని మెచ్చుకోవడం చాలా హ్యపీగా అనిపించింది. అంతే కాకుండా సినిమా సక్సెస్ పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. సాయికార్తీక్ గారు అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. ఆడియో పెద్ద హిట్టయింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికేట్ ను పొందింది. వెంకటేష్ గారి లాంటి నిర్మాత వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఉలవచారు బిర్యాని తర్వాతే నేను హీరోగా చేసిన ఈ సినిమా విడుదలవుతుంటే చాలా ఎగ్జయిట్ గా ఉంది. సినిమాని వచ్చే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని హీరో తేజస్ అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







