ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఒక్క తెలుగు సినిమా లేకపోవడం గమనార్హం..
- November 02, 2016
తెలుగు సినిమా పరిధి పెరిగింది. వందల కోట్ల కలెక్షన్స్ సాధించే స్థాయికి ఎదిగింది. బాహుబలి లాంటి ఒక తెలుగు చిత్రం వందల కోట్ల వసూళ్లు సాధించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తలమానికంగా చెప్పుకునే బాలీవుడ్ కూడా తెలుగోడికి జై కొట్టేలా చేసింది. తెలుగులో ఇప్పటివరకూ ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. కానీ ఈ విషయం మన సినిమా పండితుల కంట పడినట్టు లేదు. తెలుగు సినీ పరిశ్రమను ఘోరంగా అవమానించారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2016కు ఇటీవల నామినేషన్స్ జరిగాయి. దాదాపు 230 సినిమాలు ఈ జాబితాలో నిలిచాయి. ఇందులో ఆరు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద 22 సినిమాలను ఎంపిక చేశారు. అయితే వీటిల్లో ఏ ఒక్క తెలుగు సినిమా లేకపోవడం గమనార్హం.ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొంది, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2015లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా పేరుతెచ్చుకున్న బాహుబలి సినిమాను కూడా సభ్యులు ఎంపిక చేయలేదు. అయితే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా పేరొచ్చినందుకు ఏదో నామమాత్రంగా ఈ చిత్రాన్ని ఎంపిక చేయకపోయినప్పటికీ ప్రదర్శిస్తున్నారు. నవంబర్ 20న ఈ కార్యక్రమం గోవాలో జరగనుంది. అంతే తప్ప ఎలాంటి గౌరవం దక్కలేదు.ఈ విషయం గురించి తెలుగు సినీ నిర్మాత సివిరెడ్డి మాట్లాడుతూ ఈ విషయంలో పూర్తి వైఫల్యం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలదేనని చెప్పారు. సినీ పరిశ్రమకు ప్రోత్సహకాలు కల్పించినట్లయితే ఎన్నో గొప్ప కథలు తీయడానికి దర్శకులు సిద్ధంగా ఉన్నారన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్రాంతీయ చిత్రాలకు 50లక్షల సబ్సిడీని ప్రకటించిందని ఈ సందర్భంగా రెడ్డి గుర్తు చేశారు. తెలుగు సినిమా దర్శకులు కమర్షియల్ థోరణిలోనే వెళుతున్నారు తప్ప కథా ప్రాముఖ్యత కలిగిన సినిమాలను తీయడం లేదని చెప్పారు.సివిరెడ్డి ఈ చిత్రాలను ఎంపిక చేసిన బృందంలో సభ్యుడు కావడం విశేషం.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







