సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం బీసీసీఐ ఎంపిక

- November 02, 2016 , by Maagulf
సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం బీసీసీఐ ఎంపిక

సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేసింది. విరాట్‌ కోహ్లి సారథ్యంలోని 15మంది జట్టు సభ్యుల బృందాన్ని మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఒక టెస్టు మ్యాచ్‌ ఆడిన గౌతమ్‌ గంభీర్‌, ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నారు. హార్దిక్‌ పాండ్యా తొలిసారి టెస్ట్‌జట్టుకు ఎంపిక కావడం విశేషం. గాయం కారణంగా రోహిత్‌ శర్మ చోటు కోల్పోయాడు.
మొదటి రెండు టెస్టులకు ఎంపికైన జట్టు: విరాట్‌ కోహ్లీ, రహానె, ఇషాంత్‌ శర్మ, చటేశ్వర పూజారా, గౌతమ్‌ గంభీర్‌, జయంత్‌ యాదవ్‌, అమిత్‌ మిశ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, వర్దమాన్‌ సాహా, కరుణ్‌ నాయర్‌, మురళీ విజయ్‌, మహ్మద్‌ షమి, ఉమేష్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య.

  
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com