బొగ్గు గనిలో ఘోర విషాదం
- November 02, 2016
చైనాలోని లౌసు నగరంలోని బొగ్గు గనిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలోని జిన్షాంగోవు గనిలో సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ప్రమాదంలో 33 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అయితే ఆ 33 మంది కార్మికులు మరణించినట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. ప్రమాదం సమయంలో 35 మంది గనిలో పనిచేస్తుండగా.. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మరణించిన 33 మందిలో 18 మంది మృతదేహాలు లభ్యమైనట్లు వెల్లడించారు. మిగతా మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో, వినియోగంలో కూడా చైనాదే ప్రథమ స్థానం.దేశంలో అధిక సంఖ్యలో బొగ్గు గనులు ఉన్నాయి. ఈ గనుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







