చిక్కుడుకాయ 65

- August 25, 2015 , by Maagulf
చిక్కుడుకాయ 65

కావలిసిన పదార్ధాలు 

చిక్కుడు కాయలు - పావుకిలో 

పచ్చిమిర్చి - అర డజను 

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - రెండు స్పూన్లు 

సోయ సాస్‌ - రెండు స్పూన్లు 

చిల్లీ సాస్‌ - రెండు స్పూన్లు 

ఉల్లి తరుగు - ఒక స్పూను 

మైదా - రెండు స్పూన్లు 

కార్న్‌ ఫ్లోర్‌ - రెండు స్పూన్లు 

నూనె - వేయించడానికి సరిపడా 

ఉప్పు - తగినంత 

కారం - ఒకటిన్నర స్పూను 

ఆరెంజ్‌ కలర్‌ - ఒక స్పూను 

కరివేపాకు - కొద్దిగా 

తయారీ విధానం 

ముందుగా చిక్కుడు కాయలను కడిగి, ఈనెలు తీసి, రెండు ముక్కలుగా కోయాలి. ఓ గిన్నెలో కార్న్‌ ఫ్లోర్‌, మైదాపిండి, అల్లం వెలుల్లి పేస్ట్‌, ఆరెంజ్‌ రెడ్‌ కలర్‌, చిల్లీ సాస్‌, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి పలుచగా పిండిలా కలపాలి. ఇప్పుడు ఒక్కో చిక్కుడి కాయ ముక్కను అందులో ముంచి నూనెలో వేసి వేయించి పక్కన పెట్టాలి. మరో బాణలిలో నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, సోయా సాస్‌ వేసి వేగాక వేయించిన చిక్కుడు కాయ ముక్కలను వేసి కలిపితే చిక్కుడు 65 రెడీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com