అల్ ఖోర్‌లో అన్ని ప్రభుత్వ సర్వీసులు ఒకే గొడుగు కిందికి
- November 03, 2016
అల్ ఖోర్‌లో నివసిస్తున్న సిటిజన్స్ అలాగే వలసదారులు ఇకపై అన్ని ప్రభుత్వ సర్వీసులు ఒకే గొడుగు కింద పొదే అవకాశం కలుగుతోంది. న్యూ అల్ ఖోర్ సర్వీస్ సెంటర్ ఇందుకు మార్గం సుగమం చేస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ స్టాఫ్ మేజర్ జనరల్ సాద్ బిన్ జస్సిమ్ అల్ కులైఫి, ఈ సరికొత్త కేంద్రాన్ని ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటరీయర్‌కి సంబంధించిన పలు సౌకర్యాలు ఈ కేంద్రంలో లభిస్తాయి. వీటితోపాటు కొన్ని ఇతర ప్రభుత్వ సర్వీసులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. 19 కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నామనీ, మరో 4 కేంద్రాలు త్వరలో ఓపెన్ అవుతాయని ఆయన తెలిపారు. రస్ లఫ్ఫాన్, పెరల్ ఖతార్, రువైస్ ప్రాంతాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. పాస్‌పోర్ట్‌లు, ఫింగర్ ప్రింట్స్, క్రిమినల్ ఇన్ఫర్మేషన్, ఎవిడెన్సెస్ వంటివాటికి సంబంధించి అధునాతన డివైజెస్‌తో ఈ కేంద్రాలు పనిచేస్తాయి. వీసా, రెసిడెన్స్, ఎగ్జిట్ పర్మిట్, కంపెనీ రిజిస్ట్రేషన్ రెన్యువల్, రిక్రూట్‌మెంట్ కమిటీ సర్వీసులు ఒకే గొడుగు కింద అందుబాటులోకి రావడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్, కమర్షియల్ లైసెన్సులు, వర్క్, కాంట్రాక్టులు, బిల్ పేమెంట్లు కూడా అల్ కోర్ సర్వీస్ సెంటర్‌లో లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







