50 కోట్లతో తెలంగాణ సి.యం క్యాంప్ ఆఫీస్!

- November 03, 2016 , by Maagulf
50 కోట్లతో తెలంగాణ సి.యం క్యాంప్ ఆఫీస్!

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ సకల హంగులతో ఏర్పాటు కానుంది.  బేగంపేట క్యాంపు కార్యాలయం నివాసానికి అనువుగా లేదని పంజాగుట్ట వద్ద నిర్మిస్తున్నారు.  ఆర్ అండ్ బి అధికారులు నాలుగు నెలల కిందట పనులు ప్రారంభించారు.  ఈ కాంట్రాక్టును షాపూర్ జీ-పల్లోంజీ సంస్థ దక్కించుకుంది.  భవన సముదాయం కోసం మొత్తం తొమ్మిది ఎకరాలు కేటాయించారు. ఇందులో ఎకరం విస్తీర్ణంలో మూడు భవనాలు నిర్మిస్తున్నారు.  మిగిలిన ఎనిమిది ఎకరాల్లో 300 కార్ల పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.  మొదట దీని నిర్మాణ ఖర్చు 33 కోట్లు అవుతుందని అంచనా వేశారు.  కానీ ఇప్పుడు అది 50 కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. క్యాంప్ కార్యాలయాన్ని దసరానాటికి పూర్తిచేయాలనుకున్నప్పటికీ అది పూర్తికాలేదు. - 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com