ఎలుగుబంటి అమాయకత్వం
- August 26, 2015
అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊరిలో చలికాలం వచ్చిందంటే చలి చాలా ఎక్కువగా ఉండి అక్కడక్కడా నీరున్నచోట పైన గడ్డ కట్టి, లోపల నీరుండేది. అలాంటి చోట్ల నీటిలోపల చేపలుండేవి. అదే ఊళ్లో ఒక ఎలుగుబంటీ, ఒక నక్క కూడా ఉండేవి. ఎలుగుబంటికి అప్పట్లో చాలా పెద్ద తోక ఉండేది. ఆ తోకను వయ్యారంగా అటూ ఇటూ తిప్పుకుంటూ అందరూ చూడాలని తెగ సొగసు చేసేది. అప్పట్నుంచీ నక్కకు కుళ్లుబోతుతనం ఎక్కువే. ఎలుగు తోకను చూసి అసూయ పడి ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉండేది. ఒకరోజు ఎలుగు వెళ్తున్న దారిలో నక్క తన తోకను నీటిలో ముంచి పెట్టి కూర్చుంది. అప్పుడు ఎలుగు నక్క బావా ఇక్కడ ఏం చేస్తున్నావు? అని అడిగింది. నేను నా తోకతో చేపలు పడుతున్నాను. కావాలంటే నువ్వు కూడా పడతావా? అని అడిగింది. ఆ పక్కనే ఎలుగు కూర్చోబోయింది. అప్పుడు నక్క ఇక్కడ కాదు ఇక్కడ చేపలన్నీ అయిపోయాయి. నేను వేరే చోటకి తీసుకెళ్తాను అని చాలా లోతుగా నీళ్లుండే చోటికి తీసుకెళ్లి ఇక్కడ కూర్చో అస్సలు కదలకు నేనొచ్చేవరకూ లేవకు అని చెప్పి ఇంటికి వెళ్లి హాయిగా నిద్రపోయింది. తెల్లవారాక వచ్చి చూస్తే అక్కడే ఎలుగు నిద్రపోతూ కనిపించింది. దాన్ని లేపి ఇక చాలు చేపలు పట్టింది లే ఎలుగు బావా అని దాన్ని లేపగా దాని తోక చుట్టూ ఉన్న నీరు గడ్డ కట్టి పైకి లేవలేకపోయింది. ఎక్కువ చేపలు నీ తోకను పట్టుకుని ఉంటాయి. గట్టిగా లాగు అంది. బలంగా లాగేసరికి చేపలు పడేది పోయే సరి కదా దాని తోక తెగిపోయింది. నక్క పక్కున నవ్వి ఎక్కడైనా తోకతో చేపలు పడతారా తింగరి బావా అని వెక్కిరిస్తూ వెళ్లిపోయింది నక్క. అందుకే నక్కలంటే ఎలుగు బంటికి కోపం. అప్పటినుండీ వాటికి చిన్న తోకలు ఉంటున్నాయి. అందుకే చలికాలమంతా ఎలుగు బంట్లు నిద్రలోనే ఉంటాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







