డ్రగ్స్‌ పెడ్లింగ్‌: వ్యక్తికి 15 ఏళ్ళ జైలు

- November 04, 2016 , by Maagulf
డ్రగ్స్‌ పెడ్లింగ్‌: వ్యక్తికి 15 ఏళ్ళ జైలు

డ్రగ్స్‌ పెడ్లింగ్‌ కేసులో బహ్రెయిన్‌కి చెందిన ఓ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది హై క్రిమినల్‌ కోర్ట్‌. అలాగే మరో ఇద్దరు రష్యన్‌ మహిళలకు ఏడాది జైలు శిక్ష విధించింది డ్రగ్స్‌ని సేవించినందుకుగాను. డ్రగ్స్‌ పెడ్లర్‌ గురించిన సమాచారం అందగానే పోలీసులు రంగ ప్రవేశం చేసి, రెడ్‌ హ్యాండెడ్‌గా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు మెడికల్‌ టెస్ట్‌లు చేశారు. వారి నుంచి పలు రకాలైన డ్రగ్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళా నిందితులకు చెరో 200 బహ్రెయిన్‌ దిర్హామ్స్‌ జరీమానా విధించడం జరిగింది. జైలు శిక్ష ముగిసిన తర్వాత వారిని దేశం నుంచి బయటకు పంపిస్తారు. బహ్రెయినీ వ్యక్తికి జైలు శిక్షతోపాటు 3,000 బహ్రెయినీ దిర్హామ్స్‌ జరీమానా విధించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com