నవంబర్ 10వ తేదీన అనంతపురంలో పవన్‌కళ్యాణ్‌ సభ...

- November 05, 2016 , by Maagulf
నవంబర్ 10వ తేదీన అనంతపురంలో పవన్‌కళ్యాణ్‌ సభ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన 'సీమాంధ్ర హక్కుల చైతన్య సభ' కోసం ఓ స్పెషల్ సాంగ్ విడుదల అయింది. ప్రజల గుండె రగిలెరా.. అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌ను పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ పాటను బద్రీనాయుడు రాయగా, ఎమ్మెస్ వాసు పాడారు.నవంబర్ 10వ తేదీన అనంతపురంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రాంగణంలో ఈ సభ జరగనుందని, దీనికి కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జనసేన వర్గాలు తెలిపాయి.ప్రత్యేక హోదా అంశంతో పాటు అనంత కరువు, సాగు తాగునీరు తదితర అంశాలపై కూడా పవన్ స్పందించనున్నారు. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగంపై అంతటా హాట్ టాపిక్ నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com