ఫార్మర్స్‌ మార్కెట్‌కి పెరుగుతున్న వినియోగదారులు

- November 05, 2016 , by Maagulf
ఫార్మర్స్‌ మార్కెట్‌కి పెరుగుతున్న వినియోగదారులు



ఫార్మర్స్‌ మార్కెట్స్‌లో వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అల్‌ వక్రా, అల్‌ ఖోర్‌ ధఖిరా, ఉమ్‌ సలాల్‌, అల్‌ మజ్రోహ్‌ ప్రాంతాల్లోని వెజిటబుల్‌ మార్కెట్స్‌లో వివిధ రకాలైన కూరగాయలు, ఆకు కూరలు వినియోగదారుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ వారంలో వెజిటబుల్‌ మార్కెట్‌కి వినియోగదారుల తాకిడి బాగా పెరిగింది. దాంతో వెజిటబుల్స్‌కి కూడా డిమాండ్‌ ఊహించని విధంగా పెరిగిందని అమ్మకందారులు చెబుతున్నారు. రోజుకి 1,700 ఖతారీ రియాల్స్‌కి అమ్మకాలు పెరిగినట్లు ఇక్బాల్‌ అనే సేల్స్‌మెన్‌ చెప్పారు. 80 బాక్స్‌ల కూరగాయల నుంచి 120 కూరగాయల్ని తాము విక్రయానికి సిద్ధంగా ఉంచాల్సి వస్తోందని ఆయన వివరించారు. ఫ్రెష్‌గా ఉండటమే కాకుండా సెంట్రల్‌ మార్కెట్‌తో పోల్చితే తక్కువ ధరల్లోనే లభిస్తున్నట్లు ఓ వినియోగదారుడు చెప్పారు. ఈ సీజన్‌లో 80 ఖతారీ వెజిటబుల్‌ ఫామ్స్‌తోపాటు 40 యానిమల్‌ ఫార్మ్స్‌ అలాగే మూడు ఫిషరీస్‌ మార్కెట్‌లో పాల్గొనడం జరుగుతోంది. పౌల్ట్రీ మరియు బర్డ్‌ షాప్‌ కూడా ఇక్కడ వినియోగదారులకు అందుబాటలో ఉంది. ఫిష్‌, వర్డ్స్‌ మూడు రోజులపాటు (గురువారం నుంచి శనివారం వరకు) ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరచి ఉంటాయి. అల్‌ మజ్రోహ్‌లోని స్లాటర్‌ హౌస్‌ వారంలో అన్ని రోజనులూ అందుబాటులో ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com