నంది అవార్డులను ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
- November 05, 2016
రాష్ట్ర విభజన నేపథ్యంలో నంది అవార్డులను ఇవ్వడం ఆపేసారు. అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావించినా అందుకు ఏపీ నుంచి సమాధానం రాకపోవడంతో సొంతంగా తెలంగాణ ప్రభుత్వమే అవార్డులను ఇవ్వనుంది.అందులో భాగంగానే ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన హైదరాబాద్‌లో చలన చిత్ర పురస్కారాల కమిటీ సమావేశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినట్లుగా నంది పేరిట కాకుండా తెలంగాణ పేరుతో అవార్డులు ఇవ్వాలని డిసైడ్ చేశారు. 2014 జూన్ రెండు నుంచి 2015 డిసెంబరు వరకు తెలంగాణలో నిర్మించిన చలన చిత్రాలకు కలిపి పురస్కారాలు ఇవ్వాలని కమిటీ పేర్కొంది. ఇక.. 2016 జనవరి నుంచి డిసెంబరు వరకు నిర్మించే సినిమాలకు వచ్చే ఏడాది పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. అవార్డులను సైతం తెలంగాణ ప్రముఖులు పైడి జయరాజు, కాంతారావు, ప్రభాకర్‌రెడ్డి, దాశరథి, చక్రిల పేరిట అవార్డులు ఇవ్వాలని కమిటీ సూచించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







