ఈ నెల 9న మహేష్‌ కొత్త సినిమా ప్రారంభం

- November 05, 2016 , by Maagulf
ఈ నెల 9న మహేష్‌ కొత్త సినిమా ప్రారంభం

మహేష్‌బాబు కథానాయకుడిగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం షూటింగ్‌ను నవంబరు 9న లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. సందేశాత్మక కథతో నిర్మించనున్న ఈ చిత్రానికి 'భరత్‌ అను నేను' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం. ఇందులో మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చనున్నారు.
మహేష్‌ ప్రస్తుతం ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక.దీనికి 'ఏజెంట్‌ శివ' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com