సినిమా షూటింగ్‌లో ఇద్దరు స్టంట్ మాస్టర్లు మృతి

- November 07, 2016 , by Maagulf
సినిమా షూటింగ్‌లో ఇద్దరు స్టంట్ మాస్టర్లు మృతి

శాండిల్‌వుడ్‌లో ఓ షూటింగ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. మస్తిగుడి అనే  సినిమాలో కీలకమైన ఫైటింగ్ సీన్లు చిత్రీకరిస్తుండగా ఇద్దరు నటులు దుర్మరణం  పాలయ్యారు. హీరోతోపాటు ఇద్దరు విలన్లు 

హెలికాఫ్టర్ నుంచి నీళ్లలోకి దూకే  సీన్ తీస్తుండగా ఈ ఘటన చేటుచేసుకుంది. లక్కీగా హీరో దునియా విజయ్‌ ప్రాణాలతో  బయటపడి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ఐతే.. ఈ సీన్‌లో స్టంట్‌మెన్‌తోపాటు  విలన్‌గా చేస్తున్న నటుడు నీళ్లలో మునిగి చనిపోయారు. వీళ్లిద్దినీ అనిల్,  ఉదయ్‌గా గుర్తించారు. 

తిప్పగొండనహళ్లి డ్యామ్‌లో ఈ  మస్తిగుడి షూటింగ్‌ జరుగుతోంది. ఓ సీన్‌లో  భాగంగా హీరోతోపాటు విలన్లు హెలికాఫ్టర్ నుంచి రిజర్వాయర్ నీళ్లలోకి  దూకాలి. దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకాలి.  ఐతే.. ఈ  షూటింగ్ సందర్భంగా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు.  తాళ్లవంటివి ఏమీ లేకుండా డైరెక్ట్‌గా 100 అడుగుల ఎత్తు నుంచి కిందకి  దూకడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. డూప్ లేకుండా స్టంట్స్ చేశామని చెప్పుకునేందుకు సినిమా యూనిట్  అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు  చెప్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com