విదేశాలకెళ్లి జైలుపాలైన ప్రవాసీయులు
- November 07, 2016
బతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలసజీవుల జీవితాలు ఛిద్రమయ్యాయి. అప్పులు చేసి వీసాలు తీసుకుని దేశం కాని దేశానికి వెళ్లిన బడుగుజీవుల ఆశలు అడియాసలయ్యాయి. ఆఖరికీ జైలుపాలై పలువురు తెలుగువారు దీనంగా బతుకీడుస్తున్నారు.
స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సౌదీ అరేబియాలోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న విదేశీయులను ఇంటికి పంపించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తెలంగాణ జిల్లాలకు చెందిన పలువురు వలస జీవులు ఉద్యోగాలు పోయాయి. అప్పులు చేసి సౌదీకి వస్తే.. ఆ అప్పులు తీరకముందే ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో చాలామంది కంపెనీల్లో ఉద్యాగాలు పోయినా..
బయట చిన్నాచితక పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. అయితే, వీరి వద్ద పాస్‌పోర్టు లేకపోవడంతో వారిని సౌదీ పోలీసులు అరెస్టు చేసి జైలులో వేశారు. తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన 300 మంది వలస జీవులు అవుట్ పాస్‌పోర్టు లేక ఇలా బందీలుగా కారాగార వాసం చేస్తున్నారు.
పట్టించుకోని ఎంబసీ అధికారులు..
సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం(ఎంబసీ) అధికారులు ఈ వలస జీవులను ఆదుకోవాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. సౌదీ జైళ్లలో మగ్గుతున్న భారతీయులను గుర్తించి.. వారికి అవుట్ పాస్‌పోర్టు జారీ చేయాల్సి బాధ్యత ఎంబసీ అధికారులది. కానీ ఎంబసీ అధికారుల్లో చాలామంది కేరళ రాష్ట్రానికి చెందిన వారు కావడంతో తమను వారు పట్టించుకోవడం లేదని తెలంగాణ వలస జీవులు ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కె.తారక రామారావు జోక్యం చేసుకుని విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడితే అవుట్ పాస్‌పోర్టులు ఇప్పించాలని వారు కోరుతున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









