బ్రిటన్ ప్రధాని థెరిసా నేడు బెంగళూరు పర్యటించనున్నారు..
- November 07, 2016
బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే మంగళవారం బెంగళూరులో పర్యటించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 7.45 గంటలకు దిల్లీలో బయలు దేరి 10.30 గంటలకు నగరానికి చేరుకుంటారు. ఇక్కడి ఒక హోటల్లో సీఎం సిద్ధరామయ్యతో సమావేశమవుతారు. అనంతరం 11.50 గంటలకు యలహంక సమీపంలోని స్టోనహళ్లి (తరహుణసే) ప్రభుత్వపాఠశాలను సందర్శిస్తారు. మధ్యా హ్నం 12.05 గంటలకు డైనమిక్స్ టెక్నాలజి సంస్థ కార్యాయలానికి చేరుకుంటారు. రక్షణ, వైమానిక సంస్థలకు ఇది విడి భాగాల్ని సరఫరా చేస్తుంది. బ్రిటన్‌లోనూ దీనికి మూడు శాఖలున్నాయి. సాయంత్రం 3 గంటలకు మహాత్మాగాంధీ రోడ్డు బార్టన్ సెంటర్లో కొందరు ప్రముఖులతో సమావేశమవుతారు.అనంతరం హలసూరులోని సోమేశ్వరాలయాన్ని సందర్శిస్తారు. 5 గంటలకు దిల్లీకి బయలుదేరి వెళతారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









