ఐరాస బృందాలు అఫ్ఘనిస్తాన్‌లో పర్యటించాయి..

- November 07, 2016 , by Maagulf
ఐరాస  బృందాలు  అఫ్ఘనిస్తాన్‌లో పర్యటించాయి..

ఐక్యరాజ్యసమితి ( ఐరాస ) బృందాలు సోమవారం అఫ్ఘనిస్తాన్‌లో పర్యటించాయి.అమెరికా సంకీర్ణదళాలు ఈనెల 4న జరిపిన వైమానిక దాడుల్లో 32 మంది పౌరులు మృతి చెందగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. పౌర మరణాల పట్ల అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలతో పాటు పలు స్థానిక స్వచ్ఛంధ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈమేరకు ఐరాసలో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఐరాస సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో, ఐరాస బృందాలు అఫ్ఘాన్‌లో పర్యటించాయి. బాధిత కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించినట్టు యూఎన్‌ఏఎంఏ ( అఫ్ఘాన్‌లో ఐరాస సహాయక మిషన్‌ ) పేర్కొంది.

ఇదిలా ఉండగా, అమెరికా సంకీర్ణదళాలు అఫ్ఘాన్‌లో నిర్వహిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక అపరేషన్‌ కారణంగా సామాన్య పౌరులు మృతి చెందుతున్నారు. గతేడాది అక్టోబర్‌ 3న, కుందూజ్‌లోని మెడిసిన్స్‌ శాన్‌ ఫ్రంటీర్స్‌ ఆస్పత్రిపై యూఎస్‌ సంకీర్ణదళాలు వైమానిక దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 42 మంది మృతి చెందారు. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.

ఉద్దేశపూర్వకంగా తామీ దాడికి పాల్పడలేదని, పౌర మరణాల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. పౌర మరణాలు ఆందోళనకరం : అఫ్ఘాన్‌లో పౌర మరణాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ఐరాస ప్రకటించింది. జనవరి నుంచి జూన్‌ నెలఖారు వరకు 1,601 మంది పౌరులు మృతి చెందగా, మరో 3,565 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. అఫ్ఘనిస్తాన్‌లో చొరబాటు కోసం ప్రయత్నిస్తున్న తాలిబన్ల కారణంగా 60 శాతం మృతిచెందినట్టు నిర్ధారించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com