భారతదేశంలో పసిడికి డిమాండ్ 2016 సంవత్సరంలో 24శాతం పడిపోనుంది..
- November 08, 2016
భారతదేశంలో పసిడికి డిమాండ్ 2016 సంవత్సరంలో 24శాతం పడిపోనుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. ప్రభుత్వం బంగారం కొనుగోళ్లలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండడం, అధిక ధరలతోపాటు, దేశంలోకి పెరిగిన అక్రమ రవాణా కారణంగా డిమాండ్ గణనీయంగా పడిపోతోందని మంగళవారం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. గడచిన మొదటి మూడు త్రైమాసికాల్లో 29 శాతం క్షీణించిన పసిడి డిమాండ్ ఏడు సంవత్సరాల కనిష్ఠ స్థాయికి చేరనుందని తెలిపింది.ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగిస్తున్న దేశాల్లో రెండో స్థానంలో ఉన్న భారత్ లో ఈ సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో 441.2 టన్నుల బంగారం దిగుమతి అయిందని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 29 శాతం తక్కువని డబ్ల్యూజీసీ ఇండియా ఆపరేషన్స్ ఎండీ పీఆర్ సోమసుందరమ్ వెల్లడించారు.గత సంవత్సరం 858.1 టన్నుల బంగారం దిగుమతి అయిందన్నారు. 2009 తరువాత ఈస్థాయిలో డిమాండ్ పడిపోవడం ఈ ఏడాదే చూస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దిగుమతులు 650 నుంచి 750 టన్నుల వరకూ నమోదు కావచ్చని అంచనా వేశారు. వివిధ దేశాల నుంచి స్మగ్లింగ్ రూపంలో బంగారం తెస్తున్న అక్రమార్కులు దాన్ని తక్కువ ధరలకు విక్రయిస్తున్నారని డబ్ల్యూజీసీ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అయితే దీపావళికి ముందు బంగారం ధరలు దిగారావడం, మంచి వర్షపాత అంచనాలు కారణంగా మొదటి మూడు త్రైమాసికాల్లో పోలిస్తే నాలుగవ త్రైమాసికం కొంచెం మెరుగ్గా వుండొచ్చని ఆయన అంచనావేశారు. అలాగే దేశంలో బంగారం విక్రయాల్లో మూడవ వంతు వాటా గ్రామాలదేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







