14న విడుదల కానున్న 'పిజ్జా-2' ఆడియో
- November 08, 2016
వరుస విజయాలతో దూకుడు మీదున్న తమిళ పాపులర్ హీరో విజయ్‌సేతుపతి తమిళంలో నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్. ఈ చిత్రాన్ని పిజ్జా-2 పేరుతో.. ప్రేమకథా చిత్రమ్, జక్కన్న లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీమతి లత సమర్పణలో ఆర్పీఏ క్రియేషన్స్‌తో డీవీ సినీ క్రియేషన్స్ సంస్థ కలిసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత డి.వెంకటేష్ తెలియజేస్తూ ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసకుని థ్రిల్లర్ జోనర్లో రూపొందించబడింది. వరుసగా ఏడు హిట్లతో తమిళ సినీ రంగంలో ముందంజలో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి ఈ చిత్రం ఎనిమిదవ హిట్‌గా నిలుస్తుంది.
ఈ నెల 11న ఈ చిత్ర తెలుగు థ్రియేట్రికల్ ట్రైలర్, 14 న ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తెలుగులో ప్రేమకథా చిత్రమ్, జక్కన్న లాంటి సక్సెస్ఫుల్ చిత్రాలు నిర్మించిన ఆర్పీఏ క్రియేషన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడం ఆనందంగా వుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఇదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు అని తెలిపారు.
గాయత్రి నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నేరం ఫేమ్ రమేష్ తిలక్, సోనియా దీప్తి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శామ్ సిఎస్, సినిమాటోగ్రఫీ: దినేష్ క్రిష్ణన్, ఎడిటర్: భావన శ్రీకుమార్.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









