రేపిస్టులకు సౌదీలో 52 ఏళ్ళ జైలు శిక్ష, 7వేల కొరడా దెబ్బలు..
- November 09, 2016
ఆ దేశంలో నేరం చేసినవారికి శిక్షలు కఠినంగా ఉంటాయి అని తెలిసి కూడా దుర్మార్గులు రెచ్చిపోతూనే ఉంటారు. భర్త, కుమార్తె కళ్ళముందే మహిళపై అత్యాచారానికి పాల్పడినవారికి సౌదీ కోర్టు కఠిన శిక్ష విధించింది. వారికి 52 ఏళ్ళ జైలు శిక్ష, 7వేల కొరడా దెబ్బలు విధిస్తూ తీర్పు చెప్పింది. అత్యాచారం చేసిన నలుగురిలో ఒకరు సుడాన్ కు చెందిన వారుకాగా, మిగిలిన ముగ్గురు సౌదీకి చెందినవారు. మొత్తం జైలు జీవితంలో 50 విడతల్లో కొరడా దెబ్బల శిక్ష అమలు చేస్తారు. వివరాల్లోకి వెళితే... నలుగురు నిందితులు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమాని చేతులు ఎలక్ట్రిక్ వైరుతో కట్టేసి, కత్తితో అతని భార్యను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం 10 వేల సౌదీ రియాల్స్, ఎనిమిది మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్ళారు. నిందితులు నలుగురు మరోసారి కూడా ఆ ఇంటికి వెళ్ళి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రాసిక్యూషన్ వాదనతో పాటు, ఆ కుటుంబం ఇరుగుపొరుగు వ్యక్తుల సాక్ష్యం, నిపుణుల నివేదికలు, డాక్టర్లు, టెక్నీషియన్లు, ఇతర సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు ఆ నలుగురు వ్యక్తులను దోషులుగా నిర్థారించింది. ఇలాంటి శిక్షలు మన దేశంలో కూడా అమలు చేస్తే ఆడది అర్థరాత్రి ఒంటరిగా నడవాలన్న గాంధీ గారి కల నెరవేరకపోయినా కనీసం పగలైనా రోడ్డు మీదకు భయం లేకుండా వెళ్ళగలుగుతుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







