నేడు జపాన్‌ ప్రధాని ఆబెతో మోదీ చర్చలు...

- November 10, 2016 , by Maagulf
నేడు జపాన్‌ ప్రధాని ఆబెతో మోదీ చర్చలు...

ప్రధాని నరేంద్ర మోదీ తన జపాన్‌ పర్యటనలో భాగంగా గురువారం టోక్యో చేరుకున్నారు. జపాన్‌ రాజధానిలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. శుక్ర, శనివారాలలో జపాన్‌ ప్రధాని షింజో ఆబె, చక్రవర్తి అకిహిటో, జపాన్‌ వాణిజ్య కంపెనీల అధిపతులతో విడివిడిగా చర్చలు జరపనున్నారు. జపాన్‌తో 12 ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు, కీలకమైన పౌర అణుఒప్పందంపై భారత్ సంతకాలు చేసే అవకాశం ఉంది. భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్య అభివృద్ధి, మౌలిక సౌకర్యాల అభివృద్ధి తదితర రంగాలలో సహకారాన్ని విస్తృతం చేసుకోవడంపై శుక్రవారం ఆబెతో చర్చలు జరుపుతారు.
కాగా, మోదీ టోక్యో వెళుతూ గురువారం మార్గమధ్యంలో థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఆకస్మికంగా ఆగారు. గత నెలలో కనుమూసిన థాయ్‌ చక్రవర్తి భూమిబోల్‌ అదుల్యదేజ్‌కు ఘనంగా నివాళులర్పించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com