గల్ఫ్ వెళ్లిన గిరిజన రైతుకు అక్కడ చుక్కెదురైంది...
- November 10, 2016
ఉన్న ఊరిలో ఉపాధి లేక అప్పులు చేసి గల్ఫ్ వెళ్లిన గిరిజన రైతుకు అక్కడ చుక్కెదురైంది. నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచింది. అప్పుల భారం అధిక మైంది. దీంతో మనస్తాపం చెందిన రైతు తాను నమ్ముకున్న పొలంలోనే చెట్టుకు ఉరేసుకోవడం అందరినీ కలిచివేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాశిగుట్ట తండాకు చెందిన రైతు మాలోతు గంగారాం(48) వ్యవసా యం కుంటుపడడంతో రూ.2 లక్షలు అప్పులు చేసి గల్ఫ్‌కు వెళ్లాడు.అక్కడ కంపెనీలో పనులు లేకపోవడంతో వెళ్లిన ఏడాదికి.. అప్పులు తీర్చకుండానే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామంలో మూడె కరాల్లో పత్తి, వరిపంటలు సాగు చేశాడు. ఇటీవల కురి సిన వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించలేదు. దీనికితోడు కుమార్తెల పెళ్లిళ్లు, కుమారుడి ఆపరేషన్ కోసం మరిన్ని అప్పులు చేశాడు. పంట దిగుబడి రాకపోవడం.. గల్ఫ్ వెళ్లడానికి చేసిన అప్పులు తీరకపోవడం, కుటుంబ పోషణ భారం కావడంతో కుంగి పోయిన గంగారాం పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







