'ఇమేజ్' టవర్ల ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన కేటీఆర్

- November 11, 2016 , by Maagulf
'ఇమేజ్' టవర్ల ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన  కేటీఆర్

త్వరలో హైదరాబాద్‌లో నిర్మించబోయే 'ఇమేజ్' టవర్ల ఫస్ట్ లుక్‌ను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న నాస్‌కామ్‌ గేమ్ డెవలపర్ల సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ఈ నమూనాను ఆవిష్కరించారు. సరికొత్త, అత్యాధునిక డిజైన్‌లో ఈ టవర్లను నిర్మించడానికి తలపెట్టినట్లు తెలుస్తోంది.
ఇందులో ఇమేజ్ అంటే.. ఇన్నోవేషన్ ఇన్న మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని కేటీఆర్ ఒక ట్వీట్‌లో వివరించారు. నాలుగు వైపులా నాలుగు టవర్లతో పాటు.. పై భాగంలో వాటన్నింటినీ కలుపుతూ ఈ నిర్మాణం కనిపిస్తోంది. టవర్ల మధ్యభాగంలో కూడా పెద్ద పరిమాణంలో ఉండే టీవీ స్క్రీన్లు సైతం మోడల్‌లో కనిపిస్తున్నాయి.
కింది భాగంలో రెండు స్విమ్మింగ్ పూల్స్ కూడా డిజైన్‌లో భాగంగా ఉన్నాయి. ప్రధానంగా మల్టీమీడియా, గేమింగ్ పరిశ్రమను దృష్టిలో పెట్టకుని ఈ టవర్స్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com