బంగారం షాపులకు నోటీసులు జారీ
- November 11, 2016
ప్రధాని పెద్ద నోట్ల రద్దు తర్వాత అంటే 8 వ తేదీ రాత్రి 8 తర్వాత మీరు బంగారం కొన్నారా...? అదీ రశీదు లేకుండా బంగారం కొన్నారా..? ఐతే కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉన్నట్లే... అది ఎలాగంటే...
ప్రధాని ప్రకటన తర్వాత 8 వ తేదీ అర్ధరాత్రి వరకూ దేశంలో చాలా చోట్ల బంగారం దుకాణాలు తెరచే ఉన్నాయి అనే విషయం ప్రధాని దృష్టికి వచ్చింది. ఆ సమయంలో కొంత మంది బడాబాబులు రూ.500, రూ. 1000 నోట్లు రద్దు కావడంతో కొందరు రశీదు లేకుండా అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేసినట్లు కేంద్రానికి సమాచారం అందింది. దీంతో కేంద్ర ప్రభుత్వం బంగారం షాపు యజమానులకు నోటీసులు జారీ చేసింది. గోల్డ్ షాపుల్లోని సీసీ ఫుటేజ్ లను వెంటనే సబ్మిట్ చేయాల్సిందిగా షాపు యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫుటేజ్ ద్వారా 8 తర్వాత ఒక కుటుంబంలోని వ్యక్తులు ఎన్నిసార్లు షాపింగ్ చేశారు.. ఒకే వ్యక్తి ఎన్నిసార్లు షాపింగ్ చేశారు అనేది తెసుకొంటారు అని సమాచారం.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







